GDWL: బర్గెరకు చెందిన బోయ పద్మమ్మ(31) అనే వివాహితకు, తల్లితో నిత్యం గొడవలు జరుగుతుండటంతో తీవ్ర మనస్తాపానికి గురై పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగిన ఆమె, శనివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.