AP: పులివెందులలో కూడా పార్టీని బలోపేతం చేస్తామని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. జగన్ రెండు నాలుకల ధోరణి మానుకోవాలని హితవుపలికారు. ‘గతంలో అమరావతికి జగన్ మద్దతు ఇచ్చారు. ఇప్పుడు నదీపరివాహక ప్రాతం తగదంటున్నారు. అమరావతితో పాటు విశాఖను అభివృద్ధి చేస్తున్నాం. ఒంటిమిట్టలో పర్యాటక అభివృద్ధికి కృషి చేస్తాం’ అని మంత్రి పేర్కొన్నారు.