KDP: వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో అర్ధవృత్త గోడపై ఉన్న శివపార్వతుల కళ్యాణ శిల్పం అద్భుతంగా ఉందని చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం తెలిపారు. ఈ శిల్పంలో విష్ణువు కన్యాదానం చేస్తుండగా, బ్రహ్మ పురోహితుడిగా ఉన్నారని, ఇది శివశక్తి ఐక్యతకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.