KNR: ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఇవాళ కూడారై ఉత్సవాలను వైభవంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు వంశీధర్ చార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, అర్చనలు చేసి ఇత్తడి, వెండి గంగాళంలో పాయసాన్ని గోదా రంగనాథ స్వామికి నివేదించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.