తొలి వన్డేలో న్యూజిలాండ్ జట్టుకు టీమిండియా బౌలర్ హర్షిత్ రాణా డబుల్ షాక్ ఇచ్చాడు. హాఫ్ సెంచరీలతో నిలకడగా ఆడుతున్న ఓపెనర్లు హెన్రీ నికోల్స్ (62), డేవన్ కాన్వే (56)లను వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చాడు. దీంతో కివీస్ 126 పరుగుల వద్ద రెండు వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం విల్ యంగ్, డారిల్ మిచెల్ క్రీజులో ఉన్నారు.