SRCL: నిషేధిత మంజా విక్రయాలు వినియోగంపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై జిల్లెల రమేష్ అన్నారు. చందుర్తి మండల కేంద్రంలోని సూపర్ మార్కెట్లు, కిరాణా షాపులను ఆదివారం తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగను ప్రజలు శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నామన్నారు.