ప్రకాశం: ముండ్లమూరు మండలం మారెళ్ళ గ్రామానికి చెందిన ఒంటిపులి శివజ్యోతిని తొమ్మిది సంవత్సరాల క్రితం హైదరాబాద్కు చెందిన సత్యనారాయణకు ఇచ్చి వివాహం చేశారు. మూడు సంవత్సరాలుగా తన మామ వెంకటేశ్వర్లు, ఆడపడుచు భాగ్యలక్ష్మి అదనంగా కట్నం తేవాలని వేధిస్తున్నారని శివజ్యోతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలపారు.