SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖ హాస్య నటుడు కవులూరి వెంకట ఫణి కుమార్ అలియాస్ జబర్దస్త్ ఫణి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని దర్శించుకొని పూజలు ముగించుకున్న అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు ఆశీర్వచన కార్యక్రమం నిర్వహించారు.