SRCL: జిల్లాలో కొందరు వేర్వేరు కేసుల్లో జైలుకు వెళ్లి పరిచయమయ్యారు. ఒక్కొక్కరుగా కాకుండా కలిసే దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చిన పది రోజుల్లోనే ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్లో చోరికి పాల్పడ్డారు. నాలుగు ఇళ్లలో ఒకేరోజు దొంగతనాలు చేసి పారిపోయారు. పోలీసులు 4 రోజుల్లోనే రాజేశ్, శేఖర్, నగేశ్ అనే ముగ్గురు దొంగలను పట్టుకుని రిమాండ్కు తరలించామన్నారు.