WGL: గ్రేటర్ వరంగల్ నగరంలో డ్రైన్లను ప్రణాళికాబద్ధంగా శుభ్రం చేయాలని మేయర్ గుండు సుధారాణి శానిటేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ బల్దియా పరిధి 11వ డివిజన్ పోతననగర్‌లో శానిటేషన్ గ్యాంగ్ వర్క్‌ను మేయర్ క్షేత్రస్థాయిలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. డ్రైనేజీ వ్యవస్థలో ఎలాంటి అడ్డంకులు లేకుండా, క్రమం తప్పకుండా శుభ్రపరచాలని సూచించారు.