ADB: జిల్లా ప్రజలు ఉద్యోగాల పేరుతో మోసం చేసే మూఠా సభ్యులను, డబ్బులు అడిగే ముఠాలను నమ్మవద్దని, అలాంటి వారి పట్ల అప్రమత్తతో వ్యవహరించాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. డబ్బులతో ప్రభుత్వ ఉద్యోగాలు రావని.. కష్టపడి పరీక్షల ద్వారా ఉద్యోగాలను సాధించాలన్నారు. నకిలీ ఉద్యోగాల పేరుతో మోసం చేసే వారిపై జిల్లా పోలీసు యంత్రాంగం కఠినమైన చర్యలు తీసుకుంటుందన్నారు.