జల వివాదాల పరిష్కారానికి తెలుగు రాష్ట్రాల CMలు ముందుకు రావడం శుభసూచికమని AP TDP ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. చర్చల ద్వారానే పరిష్కారమనే అభిప్రాయం తెలుగుజాతి గౌరవం పెంచేలా ఉందని చంద్రబాబు-రేవంత్‌ను కొనియాడారు. రాష్ట్రాలుగా విడిపోయినా.. అన్నదమ్ముల్లా కలిసి ఉందామని స్ఫూర్తి కనిపిస్తోందని, తెలుగువారి ప్రయోజనాల కోసం తపన పడుతున్నారని పేర్కొన్నారు.