JN: కొడకండ్ల మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు శనివారం స్థానిక ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ… అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా సంక్షేమ పథకాలను అందించేలా చర్యలు తీసుకుంటున్నామని, మహిళా సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తూ మహిళల పేరు మీదుగానే పథకాలను అందిస్తున్నట్లు తెలిపారు.