HNK: కాజీపేట పట్టణంలోని 58వ సీనియర్ నేషనల్ ఖో-ఖో ఛాంపియన్షిప్ 2025-26కు రైల్వే స్టేడియం సిద్ధమైంది. ఈనెల 11 నుంచి 15 వరకు జరిగే పోటీలకు కోర్టు మార్కింగ్, ఫ్లడ్ లైట్లు, ఫ్లెక్సీలు, కటౌట్లతో స్టేడియం ఆకర్షణీయంగా మారింది. దేశవ్యాప్తంగా 1,976 మంది క్రీడాకారులు పాల్గొంటారు. వారికి పాఠశాలలు, కళాశాలలు, లాడ్జీలలో వసతి, భోజన ఏర్పాట్లు చేశారు.