BHPL: టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శివకేశవ ఆలయంలో ఆలయ కమిటీ ఛైర్మన్ దామరవేణి నారాయణరావు ఆధ్వర్యంలో క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ బొడ్డు తిరుపతి హాజరై క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఆలయ అభివృద్ధికి గ్రామస్థుల సహకారం అవసరమని పేర్కొన్నారు.