CTR: వెదురుకుప్పం మండలం చవట గుంట జడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో క్రికెట్ పోటీలను ఎస్సై నవీన్ బాబు నవీన్ బాబు శనివారం ప్రారంభించారు. చవట గుంట యూత్ ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నారు. యువత క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని ఎస్సై సూచించారు. పోటీలలో గెలుపొందిన వారికి నగదు బహుమతులు అందజేస్తామని ఆర్గనైజర్ అనిల్ తెలిపారు.