WPL 2026లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో గుజరాత్ విజయం సాధించింది. తొలుత గుజరాత్ 207/4 స్కోరు చేయగా.. లక్ష్య ఛేదనలో యూపీ 8 వికెట్ల నష్టానికి 197 పరుగులు చేసింది. లిట్చ్‌ఫీల్డ్ (78), లానింగ్ (30), శోభన (27*) శ్వేత (25) పరుగులు చేశారు. కీలక సమయంలో గుజరాత్ బౌలర్లు రాణించారు. రేణుక, జార్జియా, సోఫీ తలో రెండు వికెట్లు తీశారు.