SRD: సింగూర్ ప్రాజెక్టు భద్రతను దృష్టిలో ఉంచుకుని, అత్యవసర మరమ్మతులు చేపట్టడానికి జలాశయాన్ని ఖాళీ చేస్తున్నారు. ప్రాజెక్ట్ ఆనకట్ట రీవిట్మెంట్ సమస్యల కారణంగా, రాష్ట్ర డ్యామ్ సేఫ్టీ కమిటీ నివేదిక ఆధారంగా ప్రాజెక్ట్‌లోని నీటిని మొత్తం తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శనివారం జల విద్యుత్ మార్గం ద్వారా 2,300 క్యూసెక్కుల జలాల విడుదల ప్రారంభించారు.