TG: ఖమ్మంలోని SR BGNR డిగ్రీ కళాశాల గ్రౌండ్లో ఈనెల 18న మ.3 గంటలకు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు CPI నేత కూనంనేని సాంబశివరావు తెలిపారు. భారత్‌లో కమ్యూనిజం ఎక్కడ ఉందనే వారికి ఈ సభ ఒక రుజువుగా నిలువనుందన్నారు. ఈ సభకు సీఎం రేవంత్‌తో పాటు వామపక్ష పార్టీల అగ్ర నాయకులు, సుమారు 40 దేశాలకు చెందని ప్రతినిధులు హాజరుకానున్నారని వివరించారు.