బాలీవుడ్ ప్రముఖ నటుడు విద్యుత్ జామ్వాల్ చేసిన పనికి నెటిజన్లు షాకవుతున్నారు. నగ్నంగా చెట్టు ఎక్కిన అతను ఆ వీడియోను ఇన్స్టాలో పోస్ట్ చేశాడు. యుద్ధ విద్య ‘కలరిపయట్టు’ సాధకుడిగా తాను ఏడాదికోసారి ‘సహజ’ అనే యోగా ప్రక్రియను ఆచరిస్తానని తెలిపాడు. ఇది ప్రకృతితో మమేకమయ్యేలా చేస్తోందని పేర్కొన్నాడు. అయితే అడవిలో టార్జాన్ ఆకులైనా చుట్టుకుంటాడని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.