W.G: జిల్లా కలెక్టరేట్ శాశ్వత భవన నిర్మాణంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు కలెక్టరేట్ భీమవరంలోనే ఉంటుందని స్పష్టం చేసినా, అటు భీమవరం.. ఇటు ఉండి నియోజకవర్గాల మధ్య ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ క్రమంలో భవనం ఎక్కడ నిర్మిస్తారనే అంశంపై జిల్లాలో పందాల రాయుళ్లు కోట్లలో పందాలు కాస్తుండటం చర్చనీయాంశంగా మారింది.