AP: నకిలీ మద్యం తయారీ కేసులో నిందితుల రెండో రోజు విచారణ కొనసాగుతోంది. విజయవాడ గురునానక్ కాలనీలోని ఎక్సైజ్ కార్యాలయంలో నిందితులు బాలాజీ, సుదర్శన్, తలారి రంగయ్య, దారపోయిన ప్రసాద్‌ను అధికారులు ప్రశ్నించనున్నారు. కాగా నిందితులను 4 రోజుల పాటు కస్టడీకి తీసుకునేందుకు కోర్ట్ అనుమతించిన సంగతి తెలిసిందే. దీంతో అధికారులు నిన్నటి నుంచి 12 వరకు విచారించనున్నారు.