VKB: సినిమా టికెట్ల ధరలు తగ్గించాలని, ప్రీమియర్ షోలకు అనుమతి ఇవ్వొద్దని డీవైఎఫ్ఐ నేతలు అరవింద్, విజయ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరీంనగర్లోని పద్మనగర్ చౌరస్తాలో నిరసన చేపట్టారు. హీరోలను బట్టి ధరలు పెంచడం సరికాదని, ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రానికి పెంచిన రేట్లను వెంటనే ఉపసంహరించుకోవాలని, థియేటర్లలో తినుబండారాల దోపిడీని అరికట్టాలని వారు కోరారు.