KMR: బిక్కనూరు మండలంలోని పెద్ద మల్లారెడ్డిలో తాగునీటి ఎద్దడి నివారణకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నట్లు సర్పంచ్ కోడూరి సాయిగౌడ్ తెలిపారు. ఆదివారం గ్రామంలోని 7, 10 వార్డులలో నెలకొన్న సమస్యను గుర్తించి, తక్షణమే సింగిల్ ఫేస్ మోటార్లను బిగించి నీటి సరఫరాను పునరుద్ధరించారు. గ్రామంలో ఎక్కడైనా నీటి సమస్య ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని కోరారు.