VSP: జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ రాష్ట్ర నాయకులు గంట్ల శ్రీనుబాబు ఆధ్వర్యంలో జర్నలిస్టులకు సంక్రాంతి కానుకల పంపిణీ జరిగింది. ఆదివారం విశాఖ అక్కయ్యపాలెంలో తన కార్యాలయంలో ఆయన ఈ కానుకలను అందజేశారు. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా తన సొంత నిధులతో పండుగ కానుకలు అందజేస్తున్నట్లు తెలిపారు.