TPT: మంత్రి నారా లోకేష్ సాయిబాబా దర్శనార్థం నిమిత్తం శిరిడీ చేరుకున్నారు. ఇవాళ మంత్రి కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకోనున్నారు. ఈ సందర్భంగా అక్కడ మంత్రికి చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని స్వాగతం పలికారు. అనంతరం మంత్రితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. పలు అంశాలపై వారు చర్చించారు.