భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 20వ వార్డ్ హనుమాన్ నగర్లో ఎండాకాలంలో నీటి సమస్య తలెత్తకుండా ముందస్తుగా స్థానిక ఎమ్మెల్యే జీఎస్ఆర్ ఆదేశాల మేరకు పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు బట్టు కర్ణాకర్ ఆదివారం బోర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ రేణుక, వార్డు ఇంఛార్జీలు నర్సయ్య, బ్రహ్మం, వార్డు పెద్దలు పాల్గొన్నారు.