KNR: కరీంనగర్లోని 26వ డివిజన్ ఆదర్శనగర్ రూ.20 లక్షలతో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇరుకు రోడ్లలో భూగర్భ డ్రైనేజీలు నిర్మించడం ద్వారా రహదారుల విస్తరణకు సాధ్యమవుతుందన్నారు. ప్రజలకు ప్రయాణ సౌకర్యం మెరుగు పడుతుందని ఆయన తెలిపారు.