WGL: నర్సంపేట డివిజన్ ప్రజలకు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మకర సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సంక్రాంతి పండుగ ప్రజల జీవితాల్లో సుఖసంతోషాలు, ఆరోగ్యం శాంతి సమృద్ధిగా నింపాలని భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ప్రజలందరూ కుటుంబ సభ్యులతో కలిసి పండుగ ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు.