W.G: అత్తిలి గ్రామంలో వెంకమ్మ మహాకాళమ్మ జాతర వేడుకలకు గురువారం రాష్ట్ర మాజీమంత్రి, స్థానిక మాజీ ఎమ్మెల్యే కారుమూరి వెంకట నాగేశ్వరరావు హాజరయ్యారు. అనంతరం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే అమ్మవారి ఆశీస్సులు నియోజకవర్గం, రాష్ట్ర ప్రజలపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పాల్గొన్నారు.