బాలీవుడ్లో నటి సాయి పల్లవి ‘రామాయణ’, ‘ఏక్ దిన్’ మూవీలు చేస్తోంది. తాజాగా ‘ఏక్ దిన్’ రిలీజ్ డేట్ను మేకర్స్ ప్రకటించారు. 2026 మే 1న ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలిపారు. జనవరి 16న ఈ మూవీ టీజర్ రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఈ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మిస్తుండగా.. ఆయన కుమారుడు జునైద్ ఖాన్ హీరోగా నటిస్తున్నాడు. సునీల్ పాండే దర్శకత్వం వహిస్తున్నాడు.