సంక్రాంతి రోజున దైవారాధన ఎంత విశేషంగా చేస్తారో, అదేవిధంగా పితృదేవతలకు తర్పణాలు, దానాలు చేయడం ఆచార వ్యవహారాల్లో ఓ భాగం. అందువల్ల ఈ రోజు చేసే దానాలకు అనేక రెట్లు పుణ్యఫలం దక్కుతుంది. అందుకే ఈ పెద్ద పండుగ రోజున గోదానం, భూదానం, సువర్ణదానం, వెండిదానం, అన్నదానం, పుస్తక దానం, బియ్యం, పప్పూఉప్పూ, గుమ్మడికాయ వంటి నిత్యావసర వస్తువులను దానం చేస్తే శుభఫలితాలు చేకూరతాయట.