NLR: కలువాయి బస్ షెల్టర్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. బుధవారం సాయంత్రం ఈ వ్యక్తి మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 65 ఏళ్లు ఉండవచ్చని అంచనా. ఎర్ర రంగు కోటు ధరించి ఉండగా, చేతికి వెండి కడియం ఉన్నాయి. ఈ వ్యక్తి సమాచారం తెలిసిన వారు తమను 9440700009లో సంప్రదించాలని ఎస్ఐ కోటయ్య కోరారు.