BHPL: సంక్రాంతి పండుగ పురస్కరించుకుని యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇవాళ BHPL జిల్లా పుల్లూరు రామయ్యపల్లి గ్రామంలో ముగ్గుల పోటీలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కరుణాకర్ హాజరై.. పోటీల్లో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.