WGL: తెలంగాణ ఇంద్రకీలాద్రిగా ప్రసిద్ధి చెందిన శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. ప్రాతఃకాల విశేష దర్శనంలో భద్రకాళి అమ్మవారు భక్తులకు కటాక్షించారు. సంక్రాంతి సెలవుల నేపథ్యంలో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు.