అన్నమయ్య: రాయచోటి పట్టణంలోని అన్న క్యాంటీన్ల నిర్వహణకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ ద్వారా రాష్ట్ర రవాణా, యువజన క్రీడల శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రూ.3 లక్షల చెక్కును అందజేశారు. పేదరికం లేని సమాజం కోసం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టిన అన్న క్యాంటీన్ల ద్వారా పేదలకు మూడు పూటల భోజనం అందిస్తున్నామని మంత్రి తెలిపారు.