RR: సంక్రాంతి పండుగను పురస్కరించుకుని షాద్నగర్ పట్టణ మున్సిపల్ కార్మికులకు 27వ వార్డు సభ్యుడు మధు నిత్యవసర సరుకులను అందజేశారు. వారు మాట్లాడుతూ.. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమని, వారు చూపిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. కార్మికులు కుటుంబ సభ్యులతో సంతోషంగా సంక్రాంతి పండుగను జరుపుకోవాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేపట్టామన్నారు.