MDK: జిల్లాల పునర్విభజనపై అసెంబ్లీలో రెవెన్యూ మంత్రి పొంగులేటి ప్రకటనతో మార్పులపై ఆశలు పుట్టుకొచ్చాయి. ఉమ్మడి మెదక్ జిల్లాను సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాలుగా విభజించారు. కాగా, ఒక జిల్లాలోని మండలం మరో జిల్లా, నియోజకవర్గంలో ఉండడంతో ప్రజలకు, అధికారులకు ఇబ్బందిగా మారింది. పార్టీల అధ్యక్షులు సైతం గందరగోళంలో ఉండిపోయారు.