KRNL: సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇవాళ కర్నూలు మండలం ఉల్చాల గ్రామంలో నిర్వహించిన ఎద్దుల బండ లాగుడు పోటీలకు కోడుమూరు MLA బొగ్గుల దస్తగిరి హాజరయ్యారు. ఈ పోటీలను ప్రారంభించిన ఆయన, సంక్రాంతి గ్రామీణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ఇటువంటి క్రీడలు గ్రామాల మధ్య ఐక్యతను పెంపొందిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, తదితరులు పాల్గొన్నారు.