ATP: పెద్దపప్పూరులో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన కబడ్డీ, ఖోఖో పోటీలు ఉత్సాహంగా సాగాయి. కబడ్డీలో 19 జట్లు తలపడగా, ఎంఎస్కేఎన్ అనంతపురం జట్టు విజేతగా నిలిచింది. ఖోఖోలో తుగ్గలి జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. విజేతలకు పీఈటీలు చంద్ర, శ్రీధర్ బహుమతులు అందజేశారు. క్రీడాకారులు పండుగ పూట క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభను చాటారు.