MNCL: జన్నారం మండలంలోని పోన్కల్ గ్రామంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కల్యాణ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించనున్నామని ఆలయ ఛైర్మన్ రాచ కిషన్ తెలిపారు. సోమవారం ఉదయం 11.05 నిమిషాలకు గోదాదేవి సమేత రంగనాథ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి భక్తులు, ప్రజలు హాజరు కావాలన్నారు.