HNK: కాజీపేట రైల్వే స్టేషన్లో ఆదివారం అర్ధరాత్రి నేరాల నియంత్రణ, పాత నేరస్థుల గుర్తింపు లక్ష్యంతో SI శివకుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. స్టేషన్ ప్రాంగణంలో సంచరిస్తున్న అనుమానాస్పద వ్యక్తులను మొబైల్ సెక్యూరిటీ చెక్ డివైస్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. SI మాట్లాడుతూ.. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.