W.G: సంక్రాంతి పేరుతో జిల్లాలో కోడిపందేలు, జూదం వంటి చెడు వ్యసనాలు సాగకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు బీ. బలరాం డిమాండ్ చేశారు. ఆదివారం భీమవరం సీపీఎం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కోర్టు ఆదేశాలను, చట్టాలను ధిక్కరించి ప్రజలను చెడు మార్గాల వైపు మళ్లించడం సరికాదన్నారు.