MLG: గోవిందరావుపేట మండలం మచ్చపూర్ సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. కర్రలలోడుతో వెళ్తున్న ట్రాలీ ఆటో అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు కాగా, గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కర్రలు రహదారిపై చెల్లాచెదురుగా పడడంతో వాహనాల రాకపోకలకు కాసేపు అంతరయం ఏర్పడింది.