TG: సీఎం రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా? సర్కస్ కంపెనీనా అని మాజీ మంత్రి హరీష్ రావు ‘X’ వేదికగా ప్రశ్నించారు. ‘CM రేవంత్ అసెంబ్లీ వేదికగా ఏమని ప్రగల్భాలు పలికారు? నేను ఈ సీట్లో ఉన్నంతకాలం సినిమా టికెట్ రేట్ల పెంపు ఉండదు, బెనిఫిట్ షోలు ఉండవు, ఎవరికీ స్పెషల్ ప్రివిలేజ్ ఇవ్వం అని ఊదరగొట్టినవ్. మరి ఇప్పుడు రాత్రికి రాత్రే జీవోలు ఎట్లా వచ్చినయ్’ అని పేర్కొన్నారు.