సత్యసాయి: పెనుకొండలోని క్యాంపు కార్యాలయంలో వివిధ సమస్యలు, కారణాలపై విచ్చేసిన ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులతో మంత్రి సవిత సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి, సాధ్యమైనంత త్వరగా పరిష్కారం దిశగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆమె పేర్కొన్నారు.