చక్రాసనం (వీల్ పోజ్) చేయడం వల్ల వెన్నెముక బలోపేతమవుతుంది. వెన్నునొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. కాళ్లను దృఢంగా చేసి, నడవడం, పరిగెత్తడం వంటి పనులను సులభతరం చేస్తుంది. పొత్తికడుపు కండరాలపై ఒత్తిడిని పెంచి, కొవ్వును కరిగిస్తుంది. ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచి, ఆస్తమా వంటి శ్వాస సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది. చేతులు, భుజాలు, కాళ్ల కండరాలను బలపరుస్తుంది.