AKP: అనకాపల్లి మండలానికి చెందిన 12 మందికి రూ.7.54 లక్షలు సీఎం సహాయనిది మంజూరైనట్లు నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త పీలా గోవిందు తెలిపారు. గొలగాం, కోడూరు, CHN అగ్రహారం గ్రామాల్లో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి శనివారం చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతున్న వారిని కూటమి ప్రభుత్వం ఆదుకుంటున్నట్లు తెలిపారు.