TG: హైదరాబాద్లోని పంజాగుట్ట శ్రీదుర్గా భవాని ఆలయంలోని దుర్గామల్లేశ్వర స్వామిని కేంద్రమంత్రి బండి సంజయ్ దర్శించుకున్నారు. ప్రధాని మోదీ గోత్రనామాలతో అర్చన చేయించారు. ఆలయ పూజారి ప్రత్యేక అర్చన, పూజ చేశారు. అంతకుముందు ఆలయ కమిటీ సభ్యులు బండి సంజయ్కు స్వాగతం పలికారు. అనంతరం కేంద్రమంత్రిని పూలమాల, శాలువాతో సత్కరించారు. సుమారు 15 నిమిషాలపాటు బండి సంజయ్ ఆలయంలో గడిపారు.