MDK: అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ గ్రామ సమీపంలోని 161 జాతీయ రహదారి పక్కన మిషన్ భగీరథ పైప్లైన్ పగిలింది. కొద్దిరోజులుగా లీకేజీ ఉన్నప్పటికీ శనివారం ఉదయం ఒక్కసారిగా నీరు ఉప్పొంగి రోడ్డుపైకి చేరడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. స్థానికుల సమాచారంతో అధికారులు నీటి సరఫరాను నిలిపివేసి మరమ్మతు పనులు ప్రారంభించినట్లు సమాచారం.